HomeTelugu Trending'జార్జిరెడ్డి'తోవర్మ సినిమా!

‘జార్జిరెడ్డి’తోవర్మ సినిమా!

3 19వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ మరో ఆసక్తికర చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. బయోపిక్‌లు, వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే ఆయన ఈసారి హైదరాబాద్‌ దాదాల మీద పడ్డారు. ‘వంగవీటి’ చిత్రంలో రాధ, రంగా పాత్రలో అలరించిన నటుడు సందీప్‌ మాధవ్‌. ప్రస్తుతం విద్యార్థి నాయకుడు ‘జార్జిరెడ్డి’ చిత్రంలో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వర్మతో కలిసి మరో చిత్రాన్ని చేయనున్నారు. ఈ విషయాన్ని రాంగోపాల్‌ వర్మ స్వయంగా వెల్లడించారు.

” ఇప్పుడే ‘జార్జిరెడ్డి’ సందీప్‌ దాదాస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ చిత్రానికి సంతకం చేశారు. విజయవాడ రౌడీలు, రాయలసీమ ఫ్యాక్షనిస్టులు పూర్తయ్యారు. హైదరాబాద్‌లో 80 దశకంలోని దాదాలపై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా. నిజజీవిత కథ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ఈ పాత్రకు నా ‘శివ’నే స్ఫూర్తి” -రాంగోపాల్‌వర్మ

ప్రస్తుతం వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు సందీప్‌ నటించిన ‘జార్జిరెడ్డి’ ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. జీవన్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌, పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!