
వివాదస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా వెబ్ సిరీస్‌ను ప్రకటించారు. దీనికి ‘ఇది మహాభారతం కాదు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశాడు. దీనికి సంబంధించిన ఆడియో పోస్టర్‌ను వర్మ సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఈ వెబ్‌సిరీస్‌కు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్జీవీ వాయిస్ ఓవర్‌తో ఓ ఆడియో పోస్టర్‌ను వర్మ విడుదల చేశాడు. మహాభారతంలోని పాత్రలు ప్రపంచంలో ఏదో ఒక మూల కనిపిస్తాయనేది అందరికీ తెలిసిన నిజం. ఆస్తి తగాదాలు, కక్షలు, కుట్రలు, కపట నాటకాలు, భావోద్వేగాలు, వ్యసనాలు, చంపడాలు, చంపించడాలు, కొట్టుకు చావడాలు ఇలాంటివన్నీ మహాభారతం కాలం నుంచే జరుగుతున్నాయంటూ.. ఇవి మానవ జాతి అంతరించిపోయే వరకూ జరుగుతూనే ఉంటాయి అంటూ ఈ వెబ్ సిరీస్ గురించి వర్మ వాయిస్ ఓవర్‌తో ఆడియో పోస్టర్ విడుదలైంది. దీన్ని స్పార్క్ కంపెనీ నిర్మిస్తోంది. దీనికి రచన సిరాశ్రీ. తెలంగాణలోని ఓ ప్రాంతంలో జరిగిన ఘటన ఆధారం తెరకెక్కిస్తున్నట్లు వర్మ వెల్లడించాడు.












