ప్రభాస్, సల్మాన్ ఖాన్ ఓ బాలీవుడ్ సినిమా!

బాహుబలి2 తరువాత ప్రభాస్ లో బాలీవుడ్ లో సినిమా చేసే అవకాశముందంటూ వార్తలు వచ్చాయి. ప్రభాస్ కూడా మంచి స్క్రిప్ట్ దొరికితే చేస్తానని అన్నాడు. బాలీవుడ్ లో ఆయనను ప్రమోట్ చేసే బాధ్యత కరణ్ జోహార్ తీసుకున్నాడని సమాచారం. అయితే తాజాగా ఓ మల్టీస్టారర్ సినిమాలో ప్రభాస్ నటించే అవకాశాలు ఉన్నాయంటూ.. వార్తలు వస్తున్నాయి. దర్శకుడు రోహిత్ శెట్టి.. సల్మాన్ ఖాన్, ప్రభాస్ లు హీరోలుగా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ ఇద్దరి హీరోలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. దర్శకుడిగా రోహిత్ సమర్ధత తెలిసిన వాళ్ళు ఈ మల్టీస్టారర్ ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్ లు కలిసి సినిమా చేస్తే ఖచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం సల్మాన్ తన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండగా, ప్రభాస్ ‘సాహో’ సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నారు.