HomeTelugu Trendingబిగ్‌బాస్‌ సన్నీపై రౌడిషీటర్‌ దాడి..

బిగ్‌బాస్‌ సన్నీపై రౌడిషీటర్‌ దాడి..

Rowdy sheeter attacks bigg

తెలుగు బిగ్‌బాస్‌ విన్నర్‌ వీజే సన్నీపై దాడి జరిగింది. బిగ్‌బాస్‌ షోతో మరింత పాపులరైయిన సన్నీ వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో పలు సినిమాలకు సంతకం చేసిన సన్నీ ప్రస్తుతం షూటింగ్స్‌ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సన్నీ హీరోగా ఏటీఎం అనే సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుకుంటుంది. ఈ క్రమంలో బుధవారం హైదరాబాద్‌లోని హస్తినాపురం ప్రాంతంలో ఈ మూవీ షూటింగ్‌ను జరుపుకుంది. అయితే షూటింగ్‌ జరుగుతుండగా సాయంత్రం సమయంలో ఓ రౌడీషీటర్ సెట్‌కు వచ్చి హల్‌చల్‌ చేశాడు.

అంతేగాక హీరో సన్నీతో గొడవకు దిగుతూ అతడిపై దాడి చేశాడు. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే సన్నీని షూటింగ్ నుంచి కారులో పంపించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రౌడీషీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా విజేగా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన సన్నీ పలు టీవీ షోలు, సీరియల్స్‌తో గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 5లో పాల్గొనే ఆఫర్‌ కొట్టేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!