‘ఆర్ఆర్ఆర్’ సినిమా టైటిల్‌ రివీల్…

దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ సినిమా టైటిల్ పై అనేక అంచనాలు ఉన్నాయి. నెటిజన్లు ఈ సినిమా టైటిల్ పై అనేక అభిప్రాయాలను ఇప్పటికే పంచుకున్నారు. రామ రావణ రాజ్యం ఇలా ఎన్నో టైటిల్ ను అనుకున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ ను రామ రౌద్ర రిషితం అనే టైటిల్ ను అనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ టైటిల్ ను కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం. ఇక విదేశాల్లో రైజ్ రివోల్ట్ రివెంజ్ పేరుతో విడుదల చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమా టైటిల్ విషయంపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉన్నది. దసరా రోజున ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేసే అవకాశం ఉంది. అక్టోబర్ 22 వ తేదీన కొమరం భీమ్ జయంతి కావడంతో ఆ రోజున ఎన్టీఆర్ కొమరం భీమ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా అలియా నటిస్తోంది. ఎన్టీఆర్ కు జోడిగా ఎవరు చేస్తున్నారు అన్నది తెలియాల్సి ఉంది.