మహేష్ విషయంలో మరో సెంటిమెంట్!

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో ఓ సెంటిమెంట్ మహేష్ అభిమానులను ఇబ్బంది పెడుతోంది. నిజానికి మహేష్ బాబు రెండోసారి ఛాన్స్ ఇచ్చిన ఏ డైరెక్టర్ కూడా తనకు హిట్ సినిమా ఇవ్వలేకపోయాడు.

గుణశేఖర్, శ్రీకాంత్ అడ్డాల వంటి దర్శకులతో పాటు త్రివిక్రమ్ కూడా మహేష్ తో రెండోసారి ఫ్లాప్ సినిమానే చేశాడు. ఇలా మహేష్ సెకండ్ ఛాన్స్ ఇచ్చిన ప్రతిసారి కూడా దెబ్బతిన్నాడు. ఇప్పుడు కొరటాల శివకు కూడా రెండో అవకాశం ఇచ్చాడు. వీరిద్దరు కలిసి చేసిన ‘శ్రీమంతుడు’ సినిమా బ్లాక్ బాస్టర్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదే క్రమంలో ఈ సెంటిమెంట్ కూడా అభిమానులను భయపెడుతోంది. మరి కొరటాల శివ ఏంచేస్తాడో చూడాలి!