వెంకీ బావగా రాజశేఖర్!

ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం దర్శకుడు తేజ.. వెంకటేష్ తో త్వరలో ప్రారంభించబోతున్న మూవీ ప్రాజెక్ట్ లో రాజశేఖర్ ను ఒక కీలక పాత్రకు ఎంపిక చేసినట్లు టాక్. వాస్తవానికి ఈ పాత్ర కోసం నారా రోహిత్ సుమంత్ పేర్లను ముందుగా పరిశీలించినా వీరిద్దరి కంటే ఆ పాత్రకు రాజశేఖర్ సరిపోతాడు అని దర్శకుడు తేజతో పాటు వెంకటేష్ కూడ భావించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే దర్శకుడు తేజ తన ఆలోచనలను రాజశేఖర్ కు వివరించడం అతడి అంగీకారం లభించడం జరిగిపోయింది అని అంటున్నారు. గతంలో తేజ తీసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలోని హీరో పాత్రను రాజశేఖర్ కు తేజ ఆఫర్ చేస్తే అతడు సరిగ్గా స్పందించకపోవడంతో రానాకు ఆ ఛాన్స్ వచ్చింది అన్న వార్తలు ఉన్నాయి.