HomeTelugu Big Stories'RX 100' బైక్‌ వేలం.. కేరళ కు విరాళం

‘RX 100’ బైక్‌ వేలం.. కేరళ కు విరాళం

కేరళ రాష్ట్రం వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. కేరళ రాష్ట్ర ప్రజలకు తమ వంతుగా సహాయం చేసేందుకు ‘RX 100’ చిత్ర బృందం ముందుకొచ్చింది. ఈ చిత్రంలో కార్తికేయ హీరోగా, పాయల్ రాజ్‌పుత్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అశోక్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం జులై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి విశేష స్పందన లభించింది. సినిమా బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో కథానాయకుడు, కథానాయిక కలిసి యమహా RX 100 బైక్‌పై తిరుగుతారు. కేరళ వరద బాధితుల సహాయర్ధం ఈ బైక్‌ను వేలానికి ఉంచుతున్నట్లు RX 100 హీరో కార్తికేయ ప్రకటించాడు. ఈ బైక్‌ అమ్మడం ద్వారా వచ్చిన మొత్తాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇస్తామని తెలిపారు. రూ. 50 వేల నుంచి ఈ వేలం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. వివరాలను rx100auction@gmail.comకు పంపాలని కోరారు.

15 2

కేరళలో జరుగుతున్న పరిణామాల గురించి మనకు తెలుసు. మనలా సంతోషంగా ఉండే చాలా కుటుంబాలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాయి. తోటి రాష్ట్రంగా వారికి చేయూత ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది. RX 100 చిత్ర బృందం తరఫున బైక్‌ను వేలానికి ఉంచి, వచ్చిన మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలి అనుకుంటున్నాం. నిజం చెప్పాలంటే.. నాకు జీవితంలో చాలా ముఖ్యమైన వస్తువు ఆ బైక్‌. జీవితంలో ఎప్పుడూ వదులు కోకూడదు అనుకున్నా. కానీ వారికి జరిగిన నష్టం ముందు ఇది చాలా చిన్న విషయం. మా సినిమాను మీరు ఎంతో ఆదరించారు. అంతకు మించి మీరు మద్దతుగా నిలబడ వలసిన సమయం ఇది అని కార్తికేయ చెప్పాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!