‘రొమాంటిక్‌’ మూవీలో ‘సాహో’ నటి!


డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా రూపొందుతున్న సినిమా ‘రొమాంటిక్’. అనిల్ పాడూరి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి మందిరా బేడీ ఒక కీలక పాత్ర చేయనుంది. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న’సాహో’ చిత్రంలో కూడా మందిర బేడీ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ‘రొమాన్స్’ చిత్రంలో ఆకాష్ పూరికి జోడీగా కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది.