HomeTelugu Big Storiesఫోర్బ్స్ జాబితాలో సాయి పల్లవి

ఫోర్బ్స్ జాబితాలో సాయి పల్లవి

15 2

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి. ఈ చిత్రంలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టింది. నటనలో, డాన్స్‌లో, అందంలో ఈ భామతన కంటూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో ‘విరాట పర్వం’ అనే సినిమాను చేస్తోంది. వేణు ఊడుగుల (నీది నాది ఒకే కథ ఫేమ్‌) దర్శకత్వం వహిస్తున్నారు. రానా మరో ప్రధాన పాత్ర చేస్తున్నాడు. తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్‌ ప్రేమకథగా, రాజకీయ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాలో రానా రాజకీయ నాయకుడిగాను, సాయిపల్లవి పేదింటి యువతిగా.. జానపదాలు పాడే మహిళగా కనిపించనున్నది అనేది సమాచారం. ఈ సినిమాతో పాటు సాయి పల్లవి తెలుగులో మరో సినిమాలోను నటిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరో నాగచైతన్య గా నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ చిత్రంలో నటిస్తుంది ఈ భామ. ఆ మధ్య తమిళంలో స్టార్‌ హీరో సూర్య తో ‘ఎన్‌జీకే’ చిత్రంలో సాయి పల్లవి నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర అలరించలేకపోయింది. ఆ సినిమా కంటే ముందు ధనుష్‌తో జతకట్టి ఆడి పాడిన ‘మారి 2’ సినిమా మంచిగానే ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంది. అంతేకాదు ఆ సినిమాలో ‘రౌడీ బేబి’ పాట యూట్యూబ్‌ ప్రేక్షకులను విశేషంగా అలరించి రికార్డ్స్ సృష్టించింది. ఇంతగా తన నటన, డాన్స్‌తో అదరగొడుతున్న కూడా ఈ భామకు తమిళంలో ప్రస్తుతానికి ఒక్క అవకాశం లేదు. నటనలో గాని, లేదా డ్యాన్స్‌లో గాని ఏ హీరోకు తగ్గని టాలెంట్ ఆమె సొంతం.

అది అలా ఉంటే సాయి పల్లవి తాజాగా మరో రికార్డ్ సృష్టించింది. ఈ ముద్దుగుమ్మ ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్‌ తాజాగా ముప్పై సంవత్సరాలలోపు తాము ఎంచుకున్న రంగాల్లో విజయాలను పొందిన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. అందులో భాగంగా వినోద రంగంకు సంబంధించి 27 సంవత్సరాల సాయి పల్లవి చోటు సంపాదించుకుంది. దీంతో ఆమె అభిమానులు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!