శశికళ పాత్రలో సాయి పల్లవి..?

దివంగత ముఖ్యమంత్రి ‘జయలలిత’ జీవితాధారంగా బయోపిక్‌ తెరకెక్కించాలని ఎందరో దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే తమిళంలో ‘ది ఐరన్‌ లేడీ’ పేరిట జయలలితపై ఓ సినిమా రాబోతోంది. ఇందులో ఆమె పాత్రలో నిత్యామేనన్‌ నటిస్తున్నారు.అయితే ప్రముఖ తమిళ దర్శకుడు ఏ.ఎల్‌ విజయ్‌ జయలలితపై మరో బయోపిక్‌ తీయాలని భావిస్తున్నారట.

ఇందులో జయలలిత పాత్రలో బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ను ఎంపిక చేసుకున్నట్లు కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ చిత్రంలో జయలలిత స్నేహితురాలైన శశికళ పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. దీని గురించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం సాయి పల్లవి వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు.