HomeTelugu Trending'కొలవెరి..'ని బీట్‌ చేసిన సాయిపల్లవి 'వచ్చిండే..'

‘కొలవెరి..’ని బీట్‌ చేసిన సాయిపల్లవి ‘వచ్చిండే..’

13 2తమిళ స్టార్‌ ధనుష్‌ను నటి సాయిపల్లవి బీట్‌ చేసింది. ఇప్పటి వరకు దక్షిణ చిత్ర పరిశ్రమకు సంబంధించి యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ దక్కించుకున్న పాటగా ధనుష్‌ ‘కొలవెరి..’ ఉంది. ఈ పాటను ధనుష్‌ రాసి, ఆలపించారు. అనిరుధ్‌ సంగీతం అందించారు. 2011 నవంబరులో విడుదలైన ఈ పాటకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. చాలా మంది సంగీత అభిమానులు ఈ పాటకు పేరడీలు తయారు చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘కొలవెరి..’ ఓ సంచలనంలా మారింది. ఈ పాటకు ఏడేళ్లలో 172 మిలియన్‌ వ్యూస్‌ లభించాయి. 1.4 లక్షల మంది పాటను లైక్‌ చేశారు.

అయితే ఇప్పుడు ‘కొలవెరి..’ పాటని సాయిపల్లవి, వరుణ్‌తేజ్‌ నటించిన ‘వచ్చిండే..’ పాట బీట్‌ చేసింది. 2018 సెప్టెంబరులో (యూట్యూబ్‌) విడుదలైన ఈ పాటలో సాయిపల్లవి తన చక్కటి స్టెప్పులతో అందర్నీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. శక్తికాంత్‌ కార్తిక్‌ పాటకు సంగీతం సమకూర్చగా మధుప్రియ ఆలపించింది. ఈ పాట ఇప్పుడు 173 మిలియన్ వ్యూస్‌తో అత్యధిక మంది చూసిన దక్షిణాది పాటగా కొత్త రికార్డు సృష్టించింది. 4.18 లక్షల మంది ఈ పాటను లైక్‌ చేశారు. ఇది తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ విషయమని నెటిజన్లు ఈ పాటను ఉద్దేశించి కామెంట్లు చేశారు.

ధనుష్‌, సాయిపల్లవి జంటగా నటించిన ‘మారి 2’ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా మంచి టాక్‌తో చక్కటి వసూళ్లు రాబట్టినట్లు విశ్లేషకులు తెలిపారు. ఇందులోని ‘రౌడీ బేబీ..’ అనే పాటకు కూడా ప్రేక్షకాదరణ లభించింది. ఇటీవల విడుదల చేసిన ఈ పాట వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!