ఒక్కటైన ప్రేమజంట

హైదరాబాద్ కు చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు సైనా నెహ్వాల్‌, పారుపల్లి కశ్యప్‌ల పెళ్ళి జరిగింది. పెళ్ళికి ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి నిరాడంబరంగా జరిగింది. పెళ్ళికి సంబంధించిన ఫోటోలను సైనా నెహ్వాల్‌ స్వయంగా ట్వీట్‌ చేశారు. ఇవాళ రిజిస్టర్‌ వివాహం జరిగిందని, ఆదివారం సాంప్రదాయ పద్ధతిలో పెళ్ళి జరుగుతుందని సైనా ట్వీట్ చేసింది. 16న జరిగే వివాహ విందుకు మంత్రి కేటీఆర్‌, మెగాస్టార్ చిరంజీవి, కోచ్ పుల్లెల గోపీచంద్‌ తదితర ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.