HomeTelugu Trending'సైంధవ్‌' సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘సైంధవ్‌’ సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Saindhav hasrelease date anటాలీవుడ్ హీరో వెంకటేశ్.. డైరెక్టర్ శైలేష్‌ కొలను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘సైంధవ్‌’. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న సైంధవ్‌లో బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను షేర్ చేశారు మేకర్స్‌.

వెంకటేశ్‌ గన్‌ పట్టుకుని కంటెయినర్‌పై కూర్చొన్న స్టిల్‌ను షేర్ చేస్తూ.. ఈ చిత్రాన్ని 2023 డిసెంబర్‌ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్‌. ఈ తాజా లుక్‌లో వెంకటేష్‌ గూస్‌బంప్స్ తెప్పించే ఉంది. ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

వెంకటేశ్‌ 75వ సినిమాగా వస్తున్న ఈమూవీ నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌గ్లింప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu