వెంకటేశ్‌ కుమార్తె పెళ్లిలో ..సమంత ఆర్మ్‌ రెజ్లింగ్‌.. వైరల్‌

ప్రముఖ నటుడు వెంకటేశ్‌ కుమార్తె ఆశ్రిత వివాహం ఇటీవల రాజస్థాన్‌ రాజధాని జయపురలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ ఛైర్మన్‌ సురేందర్‌ రెడ్డి మనవడు వినాయక్‌ రెడ్డితో ఆశ్రిత వివాహం అట్టహాసంగా జరిగింది. కాగా.. వివాహ వేడుకలో చోటుచేసుకున్న ఫన్నీ సంఘటలకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. ఇటీవల వెంకటేశ్‌.. సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌తో కలిసి ‘జుమ్మే కీ రాత్‌ హై’ అనే పాటకు డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సమంత ఓ యువతితో ఆర్మ్‌ రెజ్లింగ్‌లో పాల్గొన్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కర్లు కొడుతోంది. పక్కనే నాగచైతన్య, రానా దగ్గుబాటి కూడా సందడి చేస్తూ కనిపించారు. ఈ ఆర్మ్‌ రెజ్లింగ్‌లో సమంతే గెలిచారు. ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్‌ అవుతోంది.