సమంత ‘యూటర్న్’ నిత్య తీసుకుంది!

కన్నడలో సూపర్ హిట్ అయిన ‘యూటర్న్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని సమంత భావించింది. ఏడాది క్రితం తనే రైట్స్ తీసుకొని నిర్మించాలని భావించిన సమంత ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం ఆశ్చర్యపరుస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ లేడీ ఓరియెంటెడ్ కథ సమంతకు బాగా సెట్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు సడెన్ గా ఆమె తప్పుకోవడంతో ఆ ప్రాజెక్ట్ నిత్యమీనన్ చేతుల్లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమంత చేతిలో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. 
రామ్ చరణ్, సుకుమార్ ల సినిమాతో పాటు, రాజు గారి గది2 అలానే మహానటి వంటి ప్రాజెక్ట్స్ తో సామ్ బిజీగా గడుపుతోంది. ఈ సినిమాలతో పాటు మరో రెండు తమిళ చిత్రాలకు ఆమె కాల్షీట్స్ ఇవ్వడంతో ఈ రీమేక్ సినిమాకు సమయం లేకుండా పోయింది. ఆ కారణంగానే ఆమె ఈ సినిమా నుండి తప్పుకుందని అంటున్నారు. సమంత స్థానంలో నిత్యను రీప్లేస్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే నిత్యతో ఈ విషయమై సంప్రదించడం దానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు.