HomeTelugu Big Storiesనాగచైతన్య డేటింగ్‌ రూమర్స్‌.. సమంత ట్వీట్‌.. వైరల్‌

నాగచైతన్య డేటింగ్‌ రూమర్స్‌.. సమంత ట్వీట్‌.. వైరల్‌

Samantha response about nag
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య మళ్లీ ప్రేమలో పడ్డాడని, హీరోయిన్‌ శోభితా ధూళిపాలతో డేటింగ్‌ చేస్తున్నాడనే వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ వార్తలను నాగచైతన్య ఫ్యాన్స్‌ తిప్పి కొడుతూ.. ‘చై ఇమేజ్‌ డ్యామేజ్‌ చేయడానికే సమంత పీర్‌ఆర్‌ టీమ్‌ ఇలాంటి రూమర్స్‌ సృష్టిస్తోంది’ అని ట్వీట్స్‌ చేశారు. తాజాగా దీనిపై సమంత తనదైన శైలిలో స్పందించారు. అమ్మాయిలపై పుకార్లు వస్తే నిజమే కానీ అబ్బాయిలపై వస్తే మాత్రం అమ్మాయిలే చేయించారని ప్రచారం చేస్తారా? అని మండిపడ్డారు.

‘అమ్మాయిపై పుకార్లు వస్తే నిజమే. అబ్బాయిపై పుకార్లు వస్తే మాత్రం అమ్మాయే చేయిస్తోందంటారు. ఇకనైనా ఎదగండి అబ్బాయిలు. మీరు ప్రస్తావించిన వ్యక్తులు ముందుకెళ్లిపోతున్నారు. మీరు కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీ పని మీద, మీ కుటుంబాల విషయాల మీద ఏకాగ్రత పెట్టండి’ అని సమంత ట్వీట్‌ చేశారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. నాగచైతన్య హీరోగా నటించిన ‘థ్యాంక్యూ’. లాల్‌ సింగ్‌ చద్దా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ‘దూత’ అనే వెబ్‌ సిరీస్‌ కూడా త్వరలోనే విడుదల కానుంది. ఇక సమంత విషయానికొస్తే.. ఇటీవల కేఆర్‌కే చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రల్లో నటించిన యశోదా, శాకుంతలం చిత్రాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!