HomeTelugu Trendingసందీప్ రెడ్డి వంగా నెక్ట్స్‌ సినిమా ఏ హీరోతోనో తెలుసా!

సందీప్ రెడ్డి వంగా నెక్ట్స్‌ సినిమా ఏ హీరోతోనో తెలుసా!

Sandeep Vanga Movie Updates

అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు సందీప్‌ రెడ్డి వంగా. తొలి సినిమాతోనే తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ సృష్టించాడు. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌తో తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమాతో దేశవ్యాప్తంగా మరో సంచలనం సృష్టించాడు. కాగా ఈ సినిమా 18 రోజుల్లో దాదాపు 1000 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డులు కొల్లగొట్టింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు రూ.70 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి.. ఈ సినిమాను కొనుక్కున్న దిల్ రాజుకు కాసుల వర్షం కురిపిస్తుంది.

ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా క్రేజ్.. మరింత పెరిగింది. ఈ క్రమంలో ఆయన తదుపరి సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. సందీప్‌ రెడ్డితో తొలి నుంచీ ట్రావెల్ అవుతున్న ప్రొడ్యూసర్ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్. తాజాగా వచ్చిన యానిమల్, అంతకుముందు సందీప్ తీసిన కబీర్ సింగ్ ఆయనే భారీ బడ్జెట్ తో నిర్మించాడు.

ఇప్పుడు కూడా సందీప్ రెడ్డి వంగా, నిర్మాత భూషణ్ కుమార్ కాంబోలో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ రానున్నాయి. అందులో ప్రభాస్ హీరోగా రూపొందనున్న స్పిరిట్, మరొకటి యానిమల్ పార్క్, మూడోది అల్లు అర్జున్ ప్రాజెక్ట్. అయితే వీటిలో మొదట ప్రభాస్ తోనే స్పిరిట్ సినిమా తెరకెక్కించనున్నాడట. ఆ తర్వాతే యానిమల్ పార్క్. ఈ రెండు సినిమా తర్వాత అల్లు అర్జున్ సినిమా. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!