సానియా 16ఏళ్ల అమ్మాయిలా మారిపోయింది

భారత టెన్నిస్‌ క్రిడాకరిణి సానియా మీర్జా తన పుట్టినరోజు వేడుకలను గురువారం జరుపుకొన్నారు. సానియా తల్లయ్యాక మొదటి పుట్టినరోజు ఇది. అంతేకాదు.. ఈరోజు వారి కుటుంబానికి మరింత ప్రత్యేకమైన రోజు. సానియా కుమారుడు ఇజాన్‌ పుట్టి 16రోజులు అవుతోంది. ఇక ఆమె తల్లి నసీమా మీర్జా పుట్టినరోజు కూడా ఈరోజే. దీంతో మీర్జా కుటుంబం సంబరాల్లో మునిగితేలింది. ఈ సందర్భంగా సానియా భర్త, పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్ సోషల్‌మీడియా వేదికగా ప్రత్యేకమైన పోస్టు పెట్టారు.

‘వేడుకల సమయం.. మా కుమారుడి వయసు 16రోజులు. ఇదే రోజు నా భార్య 16ఏళ్ల అమ్మాయిలా మారిపోయింది. మా అత్తగారు కూడా..’ అని షోయబ్‌ ట్వీట్‌ చేశారు. దీంతో పాటు కుమారుడు ఇజాన్ మీర్జా-మాలిక్‌‌, కుటుంబసభ్యుల ఫొటోలను పంచుకున్నారు. సానియా సోదరి ఆనమ్‌ మీర్జా కూడా సానియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తమ చిన్ననాటి ఫొటోను షేర్‌ చేశారు.