సంతోష్‌ శోభన్‌ హీరోగా కొత్త చిత్రం!

‘గోల్కొండ హైస్కూల్‌’, ‘తను నేను’ ఫేం సంతోష్‌ శోభన్‌ హీరోగా సింప్లిజిత్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై అభిజిత్‌ జయంతి నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌ అక్టోబర్‌ 5న ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ శిష్యుడు శ్రీనివాస్‌ చక్రవర్తి దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ముహూర్తపు షాట్‌కి సింప్లీజిత్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ డైరెక్టర్‌ మాధవీలత క్లాప్‌ నివ్వగా, ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి కెమెరా స్విచ్చాన్‌ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత అభిజిత్‌ జయంతి మాట్లాడుతూ.. ”కృష్ణవంశీగారి శిష్యుడు శ్రీనివాస్‌ చక్రవర్తి చెప్పిన కథ వినగానే ఎంతో బాగా నచ్చడంతో ఈ సినిమా నిర్మిస్తున్నాను. ఈ సినిమా సంతోష్‌ శోభన్‌కి హీరోగా చాలా మంచి పేరు తెస్తుంది” అన్నారు.
దర్శకుడు శ్రీనివాస్‌ చక్రవర్తి మాట్లాడుతూ.. ”ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాత అభిజిత్‌ జయంతిగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్నివర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుంది” అన్నారు.
సంతోష్‌ శోభన్‌, కాషిష్‌ వోహ్రా హీరో హీరోయిన్లుగా కీలక పాత్రల్లో డా|| నరేష్‌, తనికెళ్ల భరణి, అజయ్‌, వెన్నెల కిషోర్‌, గుండు సుదర్శన్‌, జెమిని సురేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డిజె వసంత్‌, కెమెరామెన్‌: సామల భాస్కర్‌, ఆర్ట్‌: కిరణ్‌కుమార్‌ మన్నె, పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, బాలాజీ, కాస్ట్యూమ్స్‌: రాజు, మేకప్‌: రామకృష్ణ, స్టిల్స్‌: మల్లిక్‌, పబ్లిసిటీ డిజైనర్‌: అనంత్‌, నిర్మాత: అభిజిత్‌ జయంతి, రచన-దర్శకత్వం: శ్రీనివాస్‌ చక్రవర్తి.

CLICK HERE!! For the aha Latest Updates