పవన్ కల్యాణ్ ను నన్ను మోసం చేస్తున్నారు!

పవన్ కల్యాణ్ నటించిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా కొన్న బయ్యర్లు నష్టపోవడంతో పవన్ వెంటనే స్పందించి వారి నష్టాల్ని పూడ్చడానికి అదే బ్యానర్ లో నిర్మాతకు చెప్పి సినిమా మొదలు పెట్టారు. అయితే ఈ విషయంలో తనను నిర్మాత, పవన్ కల్యాణ్ మేనేజర్ అయిన శ్రీనివాస్ మోసం చేస్తున్నారని వాపోతున్నారు బయ్యర్ సంపత్ కుమార్. ”సర్ధార్ సినిమా కృష్ణాజిల్లా ఏరియాకు గానూ 4,38,00,000 వెచ్చించి రైట్స్ కొన్నాను. షేర్ 2,52,00,000 వచ్చింది. కోటి 86 లక్షల నష్టం వచ్చింది. కానీ పవన్ కల్యాణ్ గారి కొత్త సినిమా హక్కులను మాకిస్తారనే నమ్మకంతో సంవత్సర కాలంగా ఎదురుచూస్తున్నాను. కానీ నిర్మాతలు స్వలాభం కోసం కొంతమంది పంపిణీదారులకు వారు చెప్పిన రేటుకి కొన్నవారికే సినిమా ఇచ్చి నన్ను మాత్రం నువ్వు మా దగ్గర సినిమా కొనలేదని ఈరోస్ వారి దగ్గర కొన్నావని మాట మారుస్తున్నారు. మొదట సినిమా మీకే ఇస్తామని చెప్పి సినిమా పూర్తి కాగానే మాట మారుస్తున్నారు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తున్నా.. లిఫ్ట్ చేయడం లేదు. వేరే నెంబర్ నుండి ఫోన్ చేస్తే ఎందుకు నువ్వు ఫోన్ చేస్తున్నావు.. నీకు నష్టం వస్తే మాకు ఎలాంటి సంబంధం లేదని అగ్రిమెంట్ లో రాసి ఉంది చదువుకో. అన్నారు. ఎక్కువ మాట్లాడితే పరువు నష్టం దావా వేస్తామని బెదిరిస్తున్నారు. వీరి సంపాదన కోసం కల్యాణ్ గారిని నన్ను మోసం చేస్తున్నారు. ఈ విషయం మా హీరో దృష్టికి వెళ్లాలని, నాకు న్యాయం జరగాలని ఆశిస్తున్నాను” అన్నారు.