‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌ డేట్‌ ప్రకటించనున్న టీమ్‌

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12 వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మహేష్ కు సంబంధించిన ఫోటోలు అనేక ఇప్పటికే యూనిట్ రిలీజ్ చేసింది. అయితే, ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్స్ కానీ, టీజర్ గాని విడుదల కాలేదు. ఈసినిమాకు సంబంధించి ఓ అప్డేట్ ను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు.

ఈరోజు సాయంత్రం 6:03 గంటలకు సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించబోతున్నారు. టీజర్ ఎప్పుడు విడుదల చేస్తున్నారు అనే విషయాన్ని యూనిట్ అధికారికంగా ప్రకటించబోతున్నది. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. విజయశాంతి కీలక పాత్రలో నటిస్తుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు