‘శాత‌క‌ర్ణి’ జైత్ర‌యాత్ర ప్రారంభం!

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌
మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్
మూవీ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ సినిమా ఇది కావ‌డంతో అభిమానులు
ప్ర‌తి కార్య‌క్ర‌మాన్ని విన్నూత‌నంగా, విశేషంగా నిర్వ‌హిస్తున్నారు. గ‌తంలో నంద‌మూరి బాల‌కృష్ణ డిక్టేట‌ర్ సినిమాకు
99 వాహనాల‌తో స్వాగతం ప‌లికిన ఎన్‌.బి.కె.హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత జగ‌న్ అండ్ టీమ్ ఆధ్వ‌ర్యంలో భార‌తదేశ
శ‌త పుణ్య‌క్షేత్ర జైత్ర‌యాత్ర‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమాల్లో ఏ హీరోకు ఆయ‌న అభిమానులు
ఇంత ఘ‌నంగా వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌లేదు. ఇలాంటి అరుదైన కార్య‌క్ర‌మాల‌ను నంద‌మూరి అభిమానులు నిర్వ‌హిస్తున్నారు.
భార‌త‌దేశంలోని 100 ప్ర‌సిద్ధిగాంచిన పుణ్య‌క్షేత్రాల్లో 100 కేజీల కుంకుమార్చ‌నతో పాటు 23 శివ‌లింగాల‌కు రుద్రాభిషేక,
స‌ర్వ‌మ‌త ప్రార్థ‌న‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఈ భార‌తదేశ స‌ర్వ‌మ‌త శ‌త పుణ్య‌క్షేత్ర జైత్ర‌యాత్ర న‌వంబ‌ర్ 9న, నంద‌మూరి
బాల‌కృష్ణ చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది. 41 రోజులు పాటు జ‌ర‌గునున్న ఈ జైత్ర యాత్ర‌లో నంద‌మూరి అభిమానులు
పాల్గొంటున్నారు. నంద‌మూరి బాల‌కృష్ణ. ద‌ర్శ‌కుడు జాగ‌ర్ల‌మూడి క్రిష్ జెండా ఊపి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. అలాగే
కుంకుమ‌, ప్ర‌సాదాల‌ను అందించారు. జూబ్లీహిల్స్‌ లోని నంద‌మూరి బాల‌కృష్ణ ఇంటి వ‌ద్ద ఈ కార్య‌క్ర‌మానికి నాంది ప‌లికారు
బాల‌కృష్ణ‌. జైత్ర‌యాత్ర మ‌హారాష్ట్ర నుండి ప్రారంభం అవుతుంది. జైత్ర‌యాత్ర పూర్త‌యిన వెంట‌నే ఓ హోమంను నిర్వ‌హించి
కుంకుమ ప్ర‌సాదాల‌ను అభిమానుల‌కు అంద‌జేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ఈ జైత్ర‌యాత్ర ప్రారంభ కార్య‌క్ర‌మంలో నంద‌మూరి
బాల‌కృష్ణ‌, నిర్మాత వై.రాజీవ్‌రెడ్డి, ద‌ర్శ‌కుడు జాగ‌ర్ల‌మూడి క్రిష్, బిబో శ్రీనివాస్‌, ఎన్‌.బి.కె.హెల్పింగ్ హ్యాండ్స్ జ‌గ‌న్ స‌హా
అభిమానులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.