Zebra OTT release date:
టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ Zebra నవంబర్ 22, 2024న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగులోనే కాకుండా తమిళ భాషలోనూ విడుదలై మిక్స్‌డ్ రివ్యూలను అందుకుంది. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్యదేవ్‌తో పాటు దాళీ ధనంజయ కీలక పాత్ర పోషించారు.
ఈ చిత్రంలో జెన్నిఫర్ పిక్సినాటో, ప్రియ భవాని శంకర్, సత్యరాజ్, సునీల్, సత్య వంటి ప్రముఖ నటులు ఉన్నారు. సినిమాలోని ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకోగా, రవి బస్రూర్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పద్మజా ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.
A win that will be cherished for a long time. Love you dear audience. #zebra pic.twitter.com/wBrRWV2eYA
— Satya Dev (@ActorSatyaDev) December 2, 2024
ఈ చిత్రం త్వరలోనే ఓటిటి ప్రేక్షకుల కోసం అందుబాటులోకి రాబోతోంది. తాజా సమాచారం ప్రకారం, డిసెంబర్ 13, 2024న ఆహా ప్లాట్‌ఫార్మ్‌లో ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్‌కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా పట్ల మరిన్ని భాషల్లో ఆసక్తి ఉన్న ప్రేక్షకుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.
సినిమా అందరినీ ఆకట్టుకున్నా కూడా.. నెగటివ్ రివ్యూల కారణంగా బాక్సాఫీస్ కలెక్షన్లలో భారీ విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ఓటిటి వేదికపై ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
ALSO READ: Bigg Boss 8 Telugu లో ట్విస్ట్ లు అయిపోయినట్టేనా?