HomeTelugu Newsఆసక్తికరమైన కంటెంట్‌తో మాయోన్

ఆసక్తికరమైన కంటెంట్‌తో మాయోన్

Maayoon movie telugu

తమిళ నటుడు సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ హీరోగా రూపొందించిన “మయోన్” చిత్రం ఈ నెల 24న తమిళంలో విడుదలైంది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ జులై 7న తెలుగులో విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. U సర్టిఫికెట్‌ పొందినట్టు వెల్లడిస్తూ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. కిశోర్ దర్శకత్వం చేసిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు.

మాయోన్ సినిమాకు ఇళయరాజా సంగీతం హైలైట్ కానుందని, ఇది మైథలాజికల్ టచ్‌తో కూడిన మిస్టరీ థ్రిల్లర్‌గా ఉంటుందని చెప్తున్నారు. రోటీన్‌కు భిన్నంగా రూపొందించిన ఈ సినిమా అడుగడుగునా ఆసక్తికరమైన మలుపులతో సాగుతుందని చెప్పారు. ఈ సినిమాలో శిబిరాజ్‌కు జోడీగా తాన్య రవిచంద్రన్ నటించింది. ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ ఓ ముఖ్య పాత్రను పోషించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu