
టాలీవుడ్‌లో ‘రౌడి బాయ్స్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆశిష్ రెడ్డి. కమర్షియల్‌గా ఈ సినిమా భారీ విజయం సాధించకపోయినా.. ఆశిష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు సెల్ఫిష్ సినిమాతో మరో సారి ప్రేక్షకులు మందుకు రావడానికి సిద్ధమయ్యాడు. విశాల్ కాశీ దర్శకుడిగా పరిచమవుతూ ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు సినిమాపై కాస్త బజ్‌ను క్రియేట్ చేశారు. ఇక ఇదిలా ఉంటే మేకర్స్ ఈ సినిమా నుంచి వరుస అప్‌డేట్‌లను విడుదల చేస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్‌డేట్‌ను చిత్రబృందం వెల్లడించింది.
దిల్ కుష్ అంటూ సాగే పాటను మే 1న విడుదల కానుంది. మిక్కీ జే మేయర్ ఈ పాటకు సంగీతం అందించాడు. ఇక ఇప్పటికే రిలీజైన హీరోయిన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆశిష్ రెడ్డికి జోడీగా లవ్‌టుడే భామ ఇవానా నటిస్తుంది. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది ద్వితియార్థంలో ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు













