కూతురిపై ఫిర్యాదు చేసిన సినియర్‌ నటుడు

తెలుగు, తమిళ విజయ్ కుమార్ పలు సినిమాల్లో నటించాడు. నటి మంజుల విజయ్ కుమార్ భర్త విజయ్‌ ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. తమిళ,తెలుగు భాషల్లోని సీరియల్స్ లో యాక్ట్ చేస్తూ బిజీగా ఉన్నారు. అతనికి ఐదుగురు సంతానం. ఇందులో అరుణ్ విజయ్ తమిళంలో బిజీ యాక్టర్. నవాబ్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. శ్రీదేవి విజయ్ కుమార్, ప్రీతి విజయ్ కుమార్లు పలు సినిమాల్లో యాక్ట్ చేశారు. మరో కూతురు వనితా విజయ్ కుమార్ ప్రొడక్షన్ రంగంలో ఉన్నది.

కాగా వనిత విజయ్ కుమార్ తన కుటుంబానికి దూరంగా ఉంటున్నది. కూతురు అడిగిందని అలపాక్కమ్ లోని అష్టలక్ష్మి నగర్లోని తనకున్న ఇంటిని షూటింగ్ నిమిత్తం అద్దెకు ఇచ్చారట. ప్రస్తుతం విజయ్ కుమార్ తన కొడుకు అరుణ్ కుమార్ తో కలిసి ఉంటున్నారు. షూటింగ్ పూర్తయినప్పటికి ఇంటికి తిరిగి అప్పగించకుండా అడిగితే దౌర్జన్యం చేస్తున్నదని చెప్పి విజయ్ కుమార్ స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు.

దీంతో పోలీసులు వనిత విజయ్ కుమార్ ను ప్రశ్నిస్తే.. ఆ ఇంట్లో తనకు వాటా ఉందని అందుకే ఖాళీ చేయనని చెప్పడం విశేషం. వాటా ఉన్నట్టుగా ఆధారాలు చూపించాలని అడగ్గా పోలీసులపై కూడా దౌర్జ్యన్యం చేసినట్టుగా తెలుస్తున్నది.