HomeTelugu Trendingరాఘవేంద్రరావుకు జోడీగా సీనియర్‌ నటి‌!

రాఘవేంద్రరావుకు జోడీగా సీనియర్‌ నటి‌!

Senior actress laxmi opposi

ద‌ర్శ‌కేంద్రుడు కె రాఘ‌వేంద్ర‌రావు ప్రధానమైన పాత్రధారిగా తనికెళ్ల భరణి ఒక సినిమా చేయనున్నారనే సంగతి తెలిసిందే. నూరు చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఇప్పుడు ఆన్‌స్క్రీన్‌లోను క‌నిపించి సంద‌డి చేయ‌నున్నాడ‌ట‌. ఈ చిత్రంలో రాఘ‌వేంద్ర రావు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిగా క‌నిపించ‌నున్నారు. ఆయ‌న భార్య పాత్ర‌లో సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మీ క‌నిపిస్తార‌ని టాక్. ఈ మధ్య కాలంలో ‘మిథునం’ , ‘నానీస్ గ్యాంగ్ లీడర్’, ఓ బేబి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఆమె, ఇప్పుడు రాఘవేంద్రరావు సరసన నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. శ్రియ ఈ సినిమాలో గెస్ట్‌ రోల్‌ చేయనుందిని అంటున్నారు. లాక్‌డౌన్ త‌ర్వాత ఈ చిత్ర షూటింగ్ మొద‌లు కానున్న‌ట్టు తెలుస్తుంది. కాగా, రాఘ‌వేంద్ర రావు ప‌ర్యవేక్ష‌ణ‌లో శ్రీకాంత్ త‌న‌యుడు హీరోగా పెళ్లి సంద‌డి చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu