నీటిలో పడిపోబోతున్న ప్రియాంక.. కాపాడిన భర్త నిక్.. వీడియో వైరల్‌

బాలీవుడ్ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా.. దాదాపు ఏడాదిపాటు డేటింగ్ కొనసాగించి, తన ప్రియుడు అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వయసులో తనకన్నా పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్‌ను మొదట క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు ప్రియాంక, నిక్ జోనస్‌లు. ఆ తర్వాత హిందూ మత సంప్రాదాయంలో కూడ వీరి పెళ్లి జరిగింది. రాజస్థాన్‌లోని జోధ్ పూర్‌లో ఉన్న ఉమాయిద్ భవన్ ప్యాలెస్‌లో రెండు కుటుంబాలకు సంబందించిన బందువులు, ఇతర ప్రమఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రియాంక పెళ్లి చేసుకుంది. అది అలా ఉంటే.. నిక్ జోనస్ సోదరుడు జోయ్ జోనస్, గేమ్ ఆఫ్ త్రోన్స్ ఫేమ్.. సోఫీ టర్నర్‌లు గత కొద్ది కాలంగా డేటింగ్ చేసి..ఇప్పుడు పెళ్లిచేసుకుంటున్నారు. అందులో భాగంగా ఈ జంట వారి వివాహం కోసమై ఇటీవల పారిస్‌కు వెళ్లారు.

అక్కడ ఈ ఇద్దరు జోయ్ జోనస్, సోఫీ టర్నర్‌ల పెళ్లికి సంబందించిన వేడుకలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ప్రియాంక తన భర్తతో కలిసి ఓ పడవలో ప్రయాణిస్తుండగా..ఒక్క సారిగా పడవ కుదుపుకు గురైంది. దీంతో ప్రియాంక అటుగా పడిపోతుండగా..నిక్ జోనస్ పడిపోతోన్న ప్రియాంకను అలా..హత్తు కున్నాడు. ఇదంతా అక్కడ పక్కనున్న వారు రికార్డ్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రియాంకకు మంచి భర్త దొరికాడని..కొందరూ.., ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడని..మరి కొందరూ.. ఇలా తెగ కామెంట్స్ పెడుతున్నారు