HomeTelugu Trendingబంగార్రాజు సీక్వెల్‌తో సీనియర్ నటి రీఎంట్రీ

బంగార్రాజు సీక్వెల్‌తో సీనియర్ నటి రీఎంట్రీ

Bangarraju sequel
అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ జంటగా తెరకెక్కిన సోగ్గాడే చిన్నినాయన మూవీ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఇందులో బంగార్రాజు పాత్రలో నాగార్జున అదరగొట్టేశాడు. ఇప్పుడు దానికి సీక్వెల్‌ తెరకెక్కబోతుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇందులో నాగచైతన్య, అఖిల్ నటిస్తున్నారు. ఇందులో నాగచైతన్య, సమంత జోడీగా నటిస్తున్నట్లు వార్తలు వచ్చినా ఆ తర్వాత తమిళ హీరోయిన్ ప్రియాంక అరుల్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయప్రదను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. పాత్ర నచ్చడంతో ఓకే చెప్పినట్లు సమాచారం. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు జయప్రద. చాలా గ్యాప్ తర్వాత బంగార్రాజు మూవీతో రీఎంట్రీ ఇస్తే అభిమానులకు పండగే.

Jayaprada

Recent Articles English

Gallery

Recent Articles Telugu