HomeTelugu TrendingVijay Deverakonda Rowdy Janardhan లో కీలక పాత్ర పోషిస్తున్న టాలీవుడ్ సీనియర్ హీరో ఎవరంటే

Vijay Deverakonda Rowdy Janardhan లో కీలక పాత్ర పోషిస్తున్న టాలీవుడ్ సీనియర్ హీరో ఎవరంటే

Senior Hero Bags Full-Length Role in Vijay Deverakonda Rowdy Janardhan!
Senior Hero Bags Full-Length Role in Vijay Deverakonda Rowdy Janardhan!

Vijay Deverakonda Rowdy Janardhan Movie Update:

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్! ఇప్పుడు ‘కింగ్‌డమ్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్న విజయ్, దానిపైన July 4న రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు, మరో మాస్ రూరల్ ఎంటర్టైనర్ “రౌడి జనార్దన్” కూడా సెట్స్ పైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది రవికిరణ్ కోల. స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది, ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ జరుపుతున్నారు.

ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ రోల్ చేయబోతున్నారట. ఆయన కోసం స్పెషల్ లుక్ టెస్ట్ కూడా జరిగింది. రాజశేఖర్ గారు కథను వినగానే ఇన్‌స్టంట్‌గా ఓకే చేసేశారట. ఆయన రెమ్యునరేషన్ కూడా బాగానే డిమాండ్ చేశారు, కానీ మేకర్స్ ఒప్పేశారు.

 

View this post on Instagram

 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

ఇటీవల కాలంలో రాజశేఖర్ గారికి చాలా అవకాశాలు వస్తున్నప్పటికీ, స్క్రిప్ట్ బాగుండాల్సిందే అన్న కండిషన్‌తోనే ముందుకు వస్తున్నారు. “రౌడి జనార్దన్” లో ఆయనకు ఫుల్ లెంగ్త్ రోల్ ఉండబోతోంది. ఈ సినిమా ద్వారా ఆయనను మళ్ళీ ఒక మాస్ అవతారంలో చూడబోతున్నాం అనిపిస్తోంది.

హీరోయిన్‌గా రష్మిక మందన్న కథానాయికగా కనిపించనుంది. ఈ కాంబినేషన్ మరోసారి తెరపై సందడి చేయనుంది. ఇక ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఇంకా ఇది చాలదనుకుంటే, విజయ్ మరో సినిమా కూడా కమిట్ అయ్యారు. “శ్యామ్ సింఘ రాయ్” ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్‌లో ఓ మూవీ జూన్ నుండి షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. మొత్తానికి విజయ్ ఈ సంవత్సరం బిజీ బిజీగా ఉండబోతున్నారు!

ALSO READ: NTR Dragon సినిమాలో హీరోయిన్ ఎవరంటే

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!