HomeTelugu Trendingకేంద్రం నిర్ణయంతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు

కేంద్రం నిర్ణయంతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు

5 17

కార్పోరేట్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. దేశీయ కంపెనీల కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇప్పటి వరకు 30 శాతం ఉన్న ట్యాక్స్‌ను 22 శాతానికి తగ్గించారు. దేశంలో ఆర్థిక మాంద్యాన్ని తట్టుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త కంపెనీలకు 25 శాతం ఉన్న పన్నును 15 శాతానికి తగ్గించారు. ఏప్రిల్ 1వ తేదీని నుంచి ఇవి అమల్లోకి రానున్నట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

తయారీ రంగంలో పెట్టుబడులు పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. తాజా నిర్ణయంతో ప్రతి ఏటా రూ.1.45 లక్షల కోట్లు ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లుతుందని చెప్పారు. అయినప్పటికీ ఆర్థిక రంగానికి ఊతమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కాగా కేంద్ర మంత్రి ప్రకటనతో స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. వరుసగా 3 రోజులపాటు నష్టాలను చవిచూసిన సెన్సెక్స్ 2 వేల పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 600 పాయింట్లకు పైగా లాభపడింది. ఇవాళ ఒక్కరోజే మదుపరుల సంపద రూ. 6 లక్షల కోట్లు పెరగడం గమనార్హం. గత పదేళ్లలో మార్కెట్లు ఒక్కరోజులో ఇంత భారీగా లాభపడటం తొలిసారి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu