షారూఖ్ గెస్ట్ రోల్ అదిరిపోతుందట!

షారూఖ్ గెస్ట్ రోల్ అదిరిపోతుందట!
బాలీవుడ్ లో కరణ్ జోహర్ దర్శకుడిగా, నిర్మాతగా ఇప్పటికే ఎన్నో చిత్రాలను రూపొందించారు. ఆయన డైరెక్షన్ లో వచ్చిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేసుకున్నాయి. అయితే 
ఈమధ్య కాలంలో ఆయన డైరెక్ట్ చేసిన సినిమా విడుదల కాలేదు. తాజాగా ‘యే దిల్ హై ముష్కిల్’ 
అనే చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి కాబట్టి
దానికి తగిన విధంగా కరణ్ జోహర్ స్టార్ కాస్ట్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. రణబీర్ కపూర్, అనుష్క శర్మ, ఐశ్వర్యరాయ్ వంటి ప్రముఖులతో పాటు షారూఖ్ ఖాన్ కూడా కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. 
నిజానికి మొదట షారూఖ్ స్థానంలో సైఫ్ అలీ ఖాను ను ఎన్నుకున్నారు. ఆయన కొన్ని రోజులు 
షూటింగ్ లో పాల్గొన్నారు కూడా.. కానీ సైఫ్ కాలికి గాయం కావడంతో తప్పుకున్నారు. ఈ స్థానంలో 
షారూఖ్ అయితే పెర్ఫెక్ట్ అని భావించిన కరణ్ ఆయనను సంప్రదించగా ఓకే చెప్పారు. ఈ సినిమాలో 
షారూఖ్ గెస్ట్ రోల్ అదిరిపోతుందట. మరి కరణ్ ఇన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తోన్న ఈ సినిమా 
ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో.. చూడాలి!
CLICK HERE!! For the aha Latest Updates