శర్వా ఇంకొకటి మొదలుపెట్టాడు!

యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, నిత్యామీనన్ ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న నూతన చిత్రం ఈ రోజు  (27 – 11 – 17 )   ఉదయం హైదరాబాద్ లోని రామానాయుడు స్థూడియో లో వైభవంగా ప్రారంభమయింది.  
కథానాయకుడు శర్వానంద్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్ని వేశానికి  ప్రముఖ కథానాయకుడు నాగ చైతన్య అక్కినేని క్లాప్ నివ్వగా, కెమెరా స్విచ్ ఆన్ ప్రముఖ దర్శకుడు మారుతి చేశారు. చిత్రం స్క్రిప్ట్ ను హారిక అండ్ హాసిని సంస్థ అధినేత ఎస్.రాధాకృష్ణ చిత్ర దర్శక నిర్మాతలకు అందజేశారు.ప్రముఖ నిర్మాతలు బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, జెమిని కిరణ్, దర్శకుడు అనిల్ రావిపూడి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
 డిసెంబర్ నెలలో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభ మవుతుందని చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.