HomeTelugu Big Storiesసీసీబీ దర్యాప్తుకు హాజరైన నటి రాధిక

సీసీబీ దర్యాప్తుకు హాజరైన నటి రాధిక

Actor radhika kumaraswamy aఅక్రమ నగదు బదిలీ ఆరోపణపై నోటీసు అందుకున్న నటి రాధిక కుమార స్వామి శుక్రవారం సీసీబీ ముందు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన ఆరోపణలపై గతేడాది డిసెంబరులో యువరాజ్ (52) అలియాస్ స్వామిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆరెస్సెస్ కార్యకర్తగా చెప్పుకుంటూ ఆయనీ మోసాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు నటి రాధిక కుమారస్వామి, యువరాజ్ మధ్య రూ. 75 లక్షల లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. దీంతో ఆమెను విచారించేందుకు సమన్లు జారీ చేశారు.

సీసీబీ దర్యాప్తునకు హాజరైన రాధిక అనంతరం మాట్లాడుతూ.. ఓ సినిమాకు సంబంధించి తన ఖాతాలో రూ. 60 లక్షలు జమ అయినట్టు చెప్పారు. అయితే, ఆ సినిమా బృందంతో ఎలాంటి ముందస్తు ఒప్పందం లేకపోవడంతో ఆ డబ్బును వెనక్కి పంపించినట్టు చెప్పారు. అంతకుముందు బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. యువరాజ్ తనకు గత 17 ఏళ్లుగా తెలుసన్నారు. ఆయన తమ కుటుంబ జ్యోతిష్యుడని చెప్పారు. అతడంటే తనకు ఎంతో విశ్వాసమని, గతేడాది అతడి అరెస్ట్ విషయం తెలిసి షాకయ్యానని పేర్కొన్నారు. కాగా, గతేడాది డిసెంబరు 16న యువరాజ్ నివాసంపై దాడులు చేసిన సీసీబీ అధికారులు రూ. 91 కోట్ల విలువైన 100 చెక్కులను స్వాధీనం చేసుకున్నారు.

యువరాజ్‌కు సొంత ప్రొడక్షన్ కంపెనీ ఉందని, ఓ చారిత్రక సినిమాలో ప్రధాన పాత్ర పోషించాలని తనను అడిగారని రాధిక తెలిపారు. తాను వెంటనే అంగీకరించానని చెప్పారు. దీంతో అడ్వాన్స్‌గా రూ. 15 లక్షలు పంపిస్తానని చెప్పి తన ఖాతాలోకి బదిలీ చేశారని వివరించారు. యువరాజ్ బావమరిది ఖాతా నుంచి మరో రూ. 60 లక్షలు తన ఖాతాకు ట్రాన్స్‌ఫర్ అయినట్టు రాధికా కుమారస్వామి వివరించారు. కాగా, ఈ కేసులో ఈడీ, ఐటీ అధికారులు కూడా రాధికను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu