షూటింగ్ పూర్తిచేసిన పూరీ

సినిమాలను వేగంగా పూర్తిచేసే దర్శకుల్లో ముందు వరుసలో పూరి జగన్నాథ్ ఉంటారు. స్క్రిప్ట్ రాయడం దగ్గర్నుంచి షూటింగ్ పూర్తిచేసే వరకు అన్ని పనులు చక చకా చేసేస్తుంటారు పూరీ జగన్నాథ్. అందుకే ఆయనతో నటీనటులకు, నిర్మాతలకు చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఆయన కొత్తగా చేస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. సినిమా
మొదలైన రోజే విడుదల తేదీని ప్రకటించారు. చెప్పినట్టుగానే షూటింగ్‌ను పూర్తిచేశారు.

టాకీ పార్ట్ కొన్నిరోజుల క్రితమే ముగియగా మిగిలిన పాటలు ఇవాళ్టితో పూర్తయ్యాయి. మొన్న 3వ తేదీన విడుదలైన ట్రైలర్ కూడా మాస్‌ను బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ నెల 18వ తేదీన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. పూరి, ఛార్మీల భాగస్వామ్యంలో నిర్మించిన ఈ చిత్రంలో రామ్ హీరోయిన్‌ కాగా నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ నెల 7వ తేదీన హన్మకొండలో నిర్వహించబోతున్నారు.