HomeTelugu Trendingచిరంజీవి సినిమాకు శృతిహాసన్‌ షాకింగ్‌ రెమ్యునరేషన్‌.. వైరల్‌

చిరంజీవి సినిమాకు శృతిహాసన్‌ షాకింగ్‌ రెమ్యునరేషన్‌.. వైరల్‌

Shruthi hasan high remunera

దర్శకుడు కెఎస్‌ రవీంద్ర అలియాస్‌ బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవి శంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటించినున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఒక విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ సినిమా కోసం శృతిహాసన్‌ తీసుకునే రెమ్యునరేషన్‌ టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

చిరంజీవి 154వ చిత్రం కోసం ఈ రేసుగుర్రం బ్యూటీ సుమారు రూ. 2 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసిందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అంతేకాకుండా ఆమె అడిగిన రెమ్యునరేషన్‌ను ఇచ్చేందుకు మేకర్స్‌ కూడా అంగీకరించారని సమాచారం. శృతిహాసన్‌ చిరంజీవికి తోనే కాకుండా నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రభాస్‌కు జోడిగా కూడా నటిస్తోంది. అయితే శృతిహాసన్‌.. బాలయ్య చిత్రానికి రూ. కోటిన్నర తీసుకోనున్నట్లు సమాచారం. సీనియర్‌ హీరోలకు జంటగా వరుస ఆఫర్లు రావడంతో శ్రుతిహాసన్‌ రెమ్యునరేషన్‌ పెంచేసినట్లు టాక్‌ వినిపిస్తోంది.

విశ్వక్‌ సేన్‌ కొత్త సినిమా ‘దాస్ కా ధమ్కీ’

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!