రెండేళ్ళ తరువాత వస్తున్న శృతి హాసన్‌!

హీరోయిన్‌ శృతి హాసన్.. తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. తెలుగులో పవన్ కళ్యాణ్ తో చేసిన కాటమరాయుడు ఆమె ఆఖరు సినిమా. ఈ సినిమా విడుదలై రెండేళ్లు అయింది. ఆ తరువాత ఇంతవరకు శృతి ఏ సినిమా చేయలేదు. అటు హిందీలోను అంతే. తన సొంత ఇండస్ట్రీ తమిళంలోనూ సినిమాలకు దూరంగా ఉంటోంది.

తాజాగా ఈ భామ అంతర్జాతీయ స్థాయిలో ఆల్బమ్స్ ను రిలీజ్ చేస్తూ బిజీగా మారడంతో.. సినిమాల్లో నటించలేకపోతున్న సంగతి తెలిసిందే. తమిళ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతితో సినిమా చేసేందుకు ఈ అమ్మడు సిద్ధం అయినట్టు సమాచారం. జనార్దన్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాకు శృతి హాసన్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.