HomeTelugu Trending'ప్రయాణికుడు' ట్రైలర్‌

‘ప్రయాణికుడు’ ట్రైలర్‌

Prayanikudu‘అమరం అఖిలం ప్రేమ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జోనాధన్ ఎడ్వర్డ్స్.. తాజాగా ”ప్రయాణికుడు” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో కృష్ణ చైతన్య – పావని హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇన్ఫీనిట్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఎమ్.కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి.

తాజాగా ‘ప్రయాణికుడు’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. రాహుల్ మాచినేని ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. మధు పొన్నాస్ సంగీతం సమకూర్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu