HomeTelugu Trendingఇండియన్‌-2: సిద్దార్థ్‌ బర్త్‌డే స్పెషల్‌ పోస్టర్‌..వైరల్‌

ఇండియన్‌-2: సిద్దార్థ్‌ బర్త్‌డే స్పెషల్‌ పోస్టర్‌..వైరల్‌

Makers of Indian 2 confirm Siddharths entry on the stars birthday
విలక్షణ నటుడు క‌మ‌ల్ హాస‌న్ హీరో నటిస్తోన్న తాజా చిత్రం ‘ఇండియన్‌ 2’. ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. కాగా ఈ సినిమాలో బొమ్మరిల్లు సిద్దార్థ్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. ఈ రోజు సిద్దార్థ్‌ పుట్టిన రోజు సందర్భంగా.. ఇండియన్‌ 2 టీం శుభాకాంక్షలు తెలియజేసింది.

లైకా ప్రొడక్షన్స్‌ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సిద్దార్థ్‌ లుక్‌ ఒకటి షేర్ చేసింది. ఈ స్టిల్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. కొన్ని రోజుల క్రితం విదేశీ యాక్షన్‌ అండ్‌ స్టంట్‌ డిజైనింగ్‌ టీంతో కమల్ హాసన్‌ జాయిన్ అయిన ఫొటోలు ఇప్పటికే నెట్టింట హల్ చల్‌ చేస్తున్నాయి. మరోవైపు తైవాన్‌లోని అందమైన లొకేషన్‌లో ఇండియన్‌ 2 షూటింగ్ స్టిల్స్‌, వీడియోలతోపాటు సౌతాఫ్రికా షెడ్యూల్‌కు సంబంధించిన అప్‌డేట్ కూడా ఇటీవలే బయటకు వచ్చింది.

ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తుండగా.. బాబీ సింహా, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, స‌ముద్రఖని ఇత‌ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇండియన్ 2 చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్-రెడ్ జియాంట్ మూవీస్ బ్యానర్లపై ఉద‌య‌నిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu