HomeTelugu Trendingరాజ్‌ తరుణ్‌కు తల్లిగా చిరంజీవి హీరోయిన్‌!

రాజ్‌ తరుణ్‌కు తల్లిగా చిరంజీవి హీరోయిన్‌!

5 13
సీనియార్‌ హీరోయిన్‌ సిమ్రాన్ ఒకప్పడు తన ఒంపు సొంపులతో ప్రేక్షకులను ఊర్రూత లూగించింది. తన అందచందాలతోనే కాకుండా అభినయంతో దక్షిణాదిన టాప్ హీరోయిన్ గా రాణించింది పంజాబీ ముద్దుగుమ్మ. అప్పటి స్టార్‌ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు ఇలా అందరితో ఆడిపాడింది ఈ బ్యూటీ. అందం అభినయంతో పాటు హీరోకు ఏమాత్రం తగ్గకుండా డాన్సులు చేసేది. వైవీయస్ చౌదరి డైరెక్షన్‌లో వచ్చిన సీతయ్యలో సిమ్రాన్ గ్లామర్ లుక్ సుపర్‌. అయితే ఆ సినిమా తర్వాత అవకాశాలు తగ్గడంతో అడపాదడపా నటిస్తూ.. పెళ్లి చేసుకొని జీవితంలో సెటిలైంది. ప్రస్తుతం ఈ భామ టిక్‌ టాక్‌లో ఎంట్రీ ఇచ్చి ఎప్పటి కప్పుడూ వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు చేరువైంది. ప్రస్తుతం ఈ భామ.. తమిళంలో పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తోంది. తుప్పారివాలన్, పేట సినిమాల్లో తనదైన పాత్రల్లో అలరించింది.

అంతేకాదు ప్రస్తుతం తమిళంలో ఆమె ఇస్త్రో సైంటిస్ట్ నంబి నారాయణ్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతున్న రాకెటరీ మూవీలో మాధవన్‌తో కలిసి నటిస్తోంది. ఈ సినిమాలతో పాటు వంగమూడి, ధృవ నక్షత్రం సినిమాలు చేస్తోంది. తాజాగా ఈ భామ రాజ్ తరుణ్ హీరోగా నటిస్తోన్న ఓ చిత్రంలో తల్లి పాత్రలో నటించడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు తమిళ చిత్రాల్లోనే క్యారెక్టర్‌గా ఆర్టిస్ట్‌గా రాణిస్తోన్న సిమ్రాన్.. ఇపుడు తెలుగులో రాజ్ తరుణ్ సినిమాతో తల్లి పాత్రతో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu