HomeTelugu Trendingగొప్ప మనసు చాటుకున్న మహేష్ కూతురు సితార

గొప్ప మనసు చాటుకున్న మహేష్ కూతురు సితార

Sitara Birthday 1

ఇవాళ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కుమార్తె సితార 11వ పుట్టినరోజు. ఈ సందర్భంగా మహేష్‌బాబు ఫౌండేషన్‌కు చెందిన పేద విద్యార్థులను తన ఇంటికి ఆహ్వానించి వారితో కలిసి బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకుంది.

వారి సమక్షంలో కేక్‌ కట్‌చేసి వారితో ముచ్చటించి ఫొటోలు తీసుకుంది. అంతే కాకుండా వారందరికీ సైకిళ్లను పంపిణీ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తండ్రి మహేష్ బాటలోనే సేవా కార్యక్రమాలు చేస్తోందంటూ సితారపై పలువురు నెటిజన్లు మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.

Sitara Birthday 2

సితారకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరూ సితారకు బర్త్ డే శుభాకాంక్షలు చెప్తున్నారు.

ఇక మహేశ్‌ బాబు సమాజ సేవలో భాగంగా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్నారు. సితార ఓ జువెలరీ యాడ్‌లో నటించిన సంగతి తెలిసిందే. తనకు వచ్చిన పారితోషికాన్ని ఛారిటీకి ఇచ్చినట్లు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తనకు సినిమాల్లోకి రావాలని ఉందని చెప్పిన సితార ప్రస్తుతం డ్యాన్స్‌ లో శిక్షణ తీసుకుంటోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!