HomeTelugu Trendingసలార్‌ డేట్‌లో వస్తున్న రామ్ స్కంద మూవీ

సలార్‌ డేట్‌లో వస్తున్న రామ్ స్కంద మూవీ

Skanda release date

టాలీవుడ్‌లోని మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో స్కంద ఒకటి. రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. స్కంద సినిమా విడుదలను అనుకున్న సమయానికి కంటే 2 వారాల తర్వాత విడుదల చేయాలని నిర్ణయించారు.

ప్రభాస్ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సి ఉండగా ఊహించని విధంగా అది వాయిదా పడింది. సలార్ మూవీ రిలీజ్ వాయిదా ప్రభాస్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇప్పటికే అమెరికాలోని థియేటర్లు సలార్ మూవీని తమ వెబ్‌సైట్ల నుంచి తొలగించాయి. సలార్ మూవీ స్థానంలో రామ్, బోయపాటి మూవీ స్కంద రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 15న ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా దానిని సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతున్నారు.

సెప్టెంబర్ 18న వినాయక చవితికి స్కంద మూవీని రిలీజ్ చేయాలని డైరెక్టర్ బోయపాటి ప్లాన్ చేశారు. కానీ హీరో రామ్, ప్రొడ్యూసర్ మాత్రం సలార్ రిలీజ్ డేట్ అయిన సెప్టెంబర్ 28న కన్ఫమ్ చేశారు. స్కంద ప్రమోషన్లు ప్రస్తుతం అందుకే ఆగిపోయాయని, ఈ నెలాఖరు నుంచి ప్రమోషన్లు గట్టిగా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రిలీజైన స్కంద ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బోయపాటి మార్క్ డైరెక్షన్, రామ్ కాంబినేషన్ మ్యాజిక్ చేస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ మూవీకి శ్రీలీల అదనపు ఆకర్షణ. రిలీజ్‌కు ముందుగానే ఈ మూవీ డిజిట‌ల్‌, శాటిలైట్ హ‌క్కులు రూ. 45 కోట్ల‌కు అమ్ముడుపోయిన‌ట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!