శోభన్ బాబు అవార్డ్స్ ప్రదానోత్సవం రేపే!

సీనియర్‌ నటుడు శోభన్ బాబుకు ఎందరో ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు. శోభన్ బాబు సినిమాలు ఎన్నో టాలీవుడ్ లో సంచలన విజయం సాధించాయి. శోభన్ బాబును అందరు సోగ్గాడు అని ఏందుకు పిలిచేవారో ఆ సినిమాలు చూస్తే అర్ధం అవుతుంది.

శోభన్ బాబు సినిమాల నుంచి పక్కకు తప్పుకున్నాక ఆయన వారసులు సినిమాల్లోకి రాలేదు. టాలీవుడ్ పరిశ్రమ ఆయన చేసిన సేవలకు గుర్తుగా శోభన్ బాబు అవార్డులను ప్రధానం చేస్తున్నది. డిసెంబర్ 25 వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.