HomeTelugu Trendingక్రిస్మస్‌ కానుకగా థియేటర్స్‌లో 'సోలో బ్రతుకే సో బెటర్'

క్రిస్మస్‌ కానుకగా థియేటర్స్‌లో ‘సోలో బ్రతుకే సో బెటర్’

Solo brathuke so better rel
హీరో సాయి ధరమ్‌ తేజ్‌, నభా నటేష్ జంటగా నటించిన చిత్రం సోలో బ్రతుకే సో బెటర్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై సుబ్బు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టయినర్ ఈ క్రిస్మస్ కానుకగా వస్తోంది. అది కూడా థియేటర్లలో విడుదల అవుతుంది. జీ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని డిసెంబరు 25న థియేటర్లలో విడుదల చేస్తోంది. ఈ మేరకు చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి. దీనిపై హీరో సాయితేజ్ ట్వీట్ చేస్తూ, థియేటర్లలో ఆడియన్స్ ఈలలు, చప్పట్లు వినేందుకు ఆగలేకపోతున్నానని పేర్కొన్నారు. తాజా పరిస్ధితుల నేపధ్యంలో థియేటర్లలో వస్తున్న తన చిత్రం ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు సమీపంలోని థియేటర్లలోకి వస్తోంది అంటూ వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!