చిరు సరసన బాలీవుడ్ తారలు!

‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఇప్పుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ అనే మరో ప్రతిష్టాత్మక సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నారు. బాహుబలి సినిమా తరువాత తెలుగు సినిమా స్థాయి పెరగడం ఆ క్రేజ్ ను ఉపయోగించుకోవాలని భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ ను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారనే విషయం ఆసక్తిగా మారింది. ఉయ్యాలవాడలో బాలీవుడ్ కు చెందిన క్రేజీ స్టార్స్ నటించబోతున్నారనేది తాజా సమాచారం. ఈ సినిమాకు అంతర్జాతీయంగా గుర్తింపు రావాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి టైటిల్ రోల్ లో చిరంజీవి కనిపించనున్నారు. దీనికోసం ఆయన గడ్డం మీసాలను పెంచి కొత్త లుక్ తో కనిపిస్తున్నారు. మొదట ఈ సినిమాలో కథానాయికలుగా విధ్యాబాలన్, ప్రియాంకా చోప్రా, ఐశ్వర్యారాయ్, సోనాక్షి సిన్హా వంటి తారలను సంప్రదించారు. తాజాగా చిరు సరసన సోనాక్షిసిన్హా, ఐశ్వర్యారాయ్ ల ఎంపిక పూర్తయిందని సమాచారం. త్వరలోనే దీని గురించి నిర్మాత రామ్ చరణ్ ఓ ప్రకటన కూడా చేయబోతున్నాడని తెలుస్తోంది. సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సోనాక్షి కాగా, ఐశ్వర్యారాయ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కీలకపాత్రలో కనిపించనుంది. దీనికోసం ఆమెకు భారీగానే ముట్టజెప్పబోతున్నారు. ఆమె పాత్ర కూడా అధ్బుతంగా ఉంటుందని సమాచారం. ఆగస్ట్ నెలలో ఈ సినిమాను మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.