HomeTelugu Trendingసోనూసూద్‌కు కరోనా

సోనూసూద్‌కు కరోనా

Sonu sood tested corona pos

బాలీవుడ్‌ నటుడు, రియల్‌ హీరో సోనూసూద్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్వీటర్‌ ద్వారా వెల్లడించారు. ‘ఈ రోజు ఉదయం కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్‌ అని తేలింది. ముందుజాగ్ర‌త్త‌గా చ‌ర్య‌గా నేను ఇప్ప‌టికే సెల్ఫ్ క్వారెంటైన్‌లో ఉన్నా. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా. ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్దు. దీనివ‌ల్ల మీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం నాకు చాలా స‌మ‌యం దొరుకుతుంది. నేను మీ అందరివాడిని అనే విష‌యం గుర్తుపెట్టుకోండి’ అని సోనూసూద్‌ ట్వీట్‌ చేశాడు. సోనూసూద్‌ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులంతా సోషల్ మీడియాలో ప్రార్థిస్తున్నారు. కాగా, సోనూసూద్‌ ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!