మహేష్ పోస్టర్ తో ఫ్యాన్స్ అవాక్!

మహేష్ బాబు ‘స్పైడర్’ సినిమా వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రీరిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. రిజల్ట్ తేడా కొట్టడంతో దాదాపు 60 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్లు సమాచారం. ఈ సినిమాను భారీ రేట్లకు కొన్న బయ్యర్లు నష్టాల పాలయ్యారు. ఇక ఈ సినిమా సంగతి పక్కన పెట్టి కొరటాల శివతో సెట్స్ పైకి వెళ్లిపోయాడు మహేష్. మురుగదాస్ కూడా విజయ్ తో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆడియన్స్ కూడా ‘స్పైడర్’ సంగతి మర్చిపోయి చాలా రోజులయ్యింది. 

ఈ క్రమంలో నిర్మాతలు ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం సినిమా ఎక్కడా ఆడడంలేదు. అయితే నిర్మాతలు మాత్రం స్పైడర్ 50 రోజులు పూర్తి చేసుకుందంటూ.. 50 డేస్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పుడిప్పుడే సినిమా చేసిన గాయాన్ని మర్చిపోయి మహేష్-కొరటాల సినిమా కోసం ఎదురుచూస్తోన్న ప్రేక్షకులకు మళ్ళీ కావాలని పాత గాయాన్ని రేపినట్లుగా ఉంది ఈ పోస్టర్.