స్పైడర్ రీషూట్లు..?

క్రియేటివిటీ ఉన్న దర్శకులు ప్రతి ఫ్రేమ్ బెటర్ గా తీయాలని సినిమాను చెక్కుతూనే ఉంటారు. మురుగదాస్ కు కూడా ఆ అలవాటు ఉంది. ఇప్పుడు ఆయన మహేష్ బాబు నటిస్తోన్న ‘స్పైడర్’ సినిమా విషయంలో కూడా అదే చేస్తున్నాడు. ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి ఈ దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో కొన్ని కీలక ఘట్టాల్ని రీషూట్ చేస్తున్నారని అందుకే సినిమా ఆలస్యం అవుతోందని టాక్. దీంతో చిత్రబృందం అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

కానీ తాజా పరిణామాల ప్రకారం సినిమా రీషూట్స్ జరుపుకుంటుందనే విషయం నిజమని తెలుస్తోంది. జూన్ 23న రావాల్సిన స్పైడర్ సినిమా వాయిదా పడి ఆగస్టుకి వెళ్లిపోయింది. చాలా వర్క్ పెండింగ్ ఉందని జూన్ లో విడుదల చేయడం సాధ్యం కాదని సమాచారం. రీషూట్స్ లేకపోతే సినిమా ఇంత ఆలస్యం ఎందుకు అవుతుందనేది అభిమానుల ప్రశ్న. మరి వీటికి చిత్రబృందం ఎలా స్పందిస్తుందో.. చూడాలి!