HomeTelugu Newsశ్రీలీల ఇలా అయిపోతే ఎలా?.. అలా ఎగిరి ఇలా పడిపోయిందే

శ్రీలీల ఇలా అయిపోతే ఎలా?.. అలా ఎగిరి ఇలా పడిపోయిందే

Sreeleela Downfall Starts A

శ్రీలీల కెరీర్‌ను చూసుకుంటే ఎంత వేగంగా ఎదిగిందో.. అంతే వేగంగా కిందకు పడిపోతోంది. ఆకాశమంత ఎత్తుకు ఎదిగి.. చివరకు పాతాళంలోకి పడ్డట్టు అయింది. కన్నడలో సినిమాలు చేసుకుంటూ ఉన్న ఈ అమ్మడు పెళ్లి సందడి సినిమాతో తెలుగు వారిని పలకరించింది. ఆ తరువాత ఆమెకు మంచి ఆఫర్లు పడుతూ వచ్చాయి. ధమాకా రూపంలో పెద్ద హిట్ వచ్చింది. అందులో ఆమె డ్యాన్సులు చూసి టాలీవుడ్ అంతా షాక్ అయింది. ఇలా చేస్తుందేంటి?అని అంతా అనుకున్నారు.

శ్రీలీల క్రేజ్ అంతకంతకూ పెరుగుతూ రావడంతో దర్శక నిర్మాతలు ఆమె డేట్ల మీద కన్నేశారు. ఊపిరి సలపనంతగా అడ్వాన్సులు ఇచ్చి బుక్ చేసేసుకున్నారు. శ్రీలీల సైతం తన వద్దకు వచ్చిన ప్రాజెక్టులన్నీ కథ కూడా వినకుండా ఒప్పేసుకున్నట్టుగా అనిపిస్తోంది. అలా ఆమె చేసిన ఆ తప్పులకు ఇప్పుడు మూల్యం చెల్లిస్తోంది. స్టార్ హీరోలు, కాంబో కదా? అని గుడ్డిగా నమ్మేసి సైన్ చేసిన చిత్రాలే ఇప్పుడు తేడా కొట్టేశాయి.

స్కంద, ఎక్స్‌ట్రా, ఆదికేశవ అంటూ ఇలా అన్ని సినిమాలు బెడిసి కొట్టేశాయి. అవన్నీ కూడా డిజాస్టర్లుగా నిలిచాయి. కాస్తలో కాస్త రొటీన్‌కు భిన్నంగా, ఎప్పుడూ ఆ కుప్పి గంతులే కాకుండా భగవంత్ కేసరిలో కాస్త ప్రాధాన్యం, నటనకు స్కోప్ ఉన్న పాత్ర వచ్చింది. భగవంత్ కేసరితో శ్రీలీలకు హిట్టు వచ్చింది. కానీ అది పూర్తిగా బాలయ్య ఖాతాలోకి వెళ్లిపోయింది. ఈ ఏడాది గుంటూరు కారం అంటూ పెద్ద గునపం దింపింది శ్రీలీల. అసలు ఆమె ఇలాంటి పాత్రలను ఎందుకు ఒప్పుకుంటోందని అంతా తలపట్టేసుకుంటున్నారు.

శ్రీలీల పని అయిపోయిందని, ఇక ఆమెను దర్శక నిర్మాతలు ఆప్షన్‌గా పెట్టుకోవడం లేదని తెలుస్తోంది. ఆమె చేతిలో ఇప్పుడు ఒక్కటంటే ఒక్క క్రేజీ ప్రాజెక్టు కూడా లేదు. మరి ఎంత వేగంగా ఎగిరిందో అంతే వేగంగా పతనం వైపు పయనించింది. ఇకపై శ్రీలీల ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!